News March 14, 2025
జగిత్యాల: పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి హంగామా

KNR జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన శివరాంకు JGTLకు చెందిన జమునతో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి జమున శివరాంను వదిలిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శివరాం మద్యం సేవించి, జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో బీరు సీసాతో తన తలకు గాయం చేసుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన శివరాంను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 21, 2025
అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్

అల్లూరి జిల్లాలో శుక్రవారం 71పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 11547మంది విద్యార్థులకు 11458మంది హాజరయ్యారని, 89మంది ఆబ్సెంట్ అయ్యారని DEO. బ్రాహ్మజీరావు తెలిపారు. చింతపల్లిలో 4 సెంటర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
News March 21, 2025
GWL: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు:DAO

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎస్టీ మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ. 56.88 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అవకాశాన్ని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 21, 2025
నిమిషానికి ప్రభుత్వ అప్పు రూ.కోటి: ఏలేటి

TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ₹2.27L రుణభారం ఉందని BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. TG అప్పు ₹8.6L Crకు చేరిందని ఆరోపించారు. ప్రభుత్వం నిమిషానికి ₹కోటి అప్పు చేస్తోందని, ఇలా రుణాలు పెరిగితే అభివృద్ధి ఎలా సాధ్యమని బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. UPA హయాంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32% ఉంటే ఇప్పుడు 42% అందుతోందని, అయినా కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు.