News March 27, 2025
జగిత్యాల: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థులు కాలేజీలలో ఆన్లైన్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు ను ఈనెల 31 నుండి మే 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 3, 2025
KNR: ‘అన్నా మాతో కాదే’.. తప్పుకుంటోన్న అభ్యర్థులు..?

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అనుకూలించినా ‘అన్నా మాతో కాదే’ అంటూ కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్ల ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు. గతంలో ముఖంచూసి ఓట్లు వేసేవారని, ఇప్పుడు లకారాలు(డబ్బు) పెట్టినా గెలుపు కష్టమనే అభిప్రాయాలు పెరిగాయి. బిల్లులు రాక పాత సర్పంచ్లు ఇబ్బందులు పడుతుంటే, పోటీకి దిగేందుకు చాలామంది ఆసక్తి చూపించట్లేదు. ఉమ్మడి KNR వ్యాప్తంగా అక్కడక్కడా ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై మీ COMMENT.
News December 3, 2025
ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేశ్

ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
News December 3, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన, కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు తెలిపారు. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. డోంగ్లిలో 12.5 C, నస్రుల్లాబాద్ 12.6, మద్నూర్, జుక్కల్లలో 12.7, బీర్కూరులో 12.8, మాచారెడ్డి, బిబిపేట్ 12.9, గాంధారి 13.1, పాల్వంచ 13.2, బిచ్కుంద, పెద్ద కొడపగల్ 13.5 తదితర మండలాలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


