News February 17, 2025
జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు(72) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్య మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గంగు శనివారం రాత్రి తన ఇంటిలో టీ తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నవీన్ చెప్పారు.
Similar News
News November 26, 2025
GWL: దివ్యాంగులకు క్రీడా పోటీలు: కలెక్టర్

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొనాలని కోరారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, పాల్గొనేవారు సర్టిఫికెట్తో 29న స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
GWL: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పరస్పర సహకారంతో అధికారులు పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.


