News February 17, 2025

జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు(72) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్య మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గంగు శనివారం రాత్రి తన ఇంటిలో టీ తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నవీన్ చెప్పారు.

Similar News

News March 23, 2025

NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

NLG: వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

image

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల మీద తిరిగే వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త చెప్పారు. గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారుల రోడ్లకు టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు.

News March 23, 2025

మేడ్చల్: ఓయో హోటల్ సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్ 

image

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓయో హోటల్స్ సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈసీఐఎల్‌లో జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ సీజ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోటల్ ముందు ధర్నా నిర్వహించారు. మైనర్లను ఓయోలోకి అనుమతించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

error: Content is protected !!