News February 12, 2026
జగిత్యాల: ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు 450మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ జారీచేసిన గుర్తింపు కార్డులుకు అనుమతి ఉందన్నారు.
Similar News
News March 17, 2026
అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.
News March 17, 2026
జగిత్యాల: కుక్క కాటు.. ప్రాణం తీసింది..!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మణితేజ(7) కుక్కకాటుకు గురై, 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2024 డిసెంబర్ 26న మెడ భాగంలో కుక్క కరవడంతో వెంటనే HYDలో చికిత్స అందించారు. అనంతరం ఇంట్లోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యం కొనసాగించారు. సుమారు రూ.65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు.
News March 17, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.


