News February 22, 2025
జగిత్యాల : ప్రశాంతమైన వాతావరణంలో MLC ఎన్నికలు జరపాలి: ఎస్పీ

ఈ నెల 27 న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల MLC ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పటిష్ఠమైన ప్రణాళిక, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహణపై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎలక్షన్స్ ముందు రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రోజు తీసుకోవాల్సిన చర్యలపై అవగహన కల్పించారు.
Similar News
News December 8, 2025
1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
News December 8, 2025
INDIGO… NAIDU MUST GO: అంబటి

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
News December 8, 2025
కుకుట్లపల్లిలో అన్నదమ్ముల మధ్య సవాల్

కౌడిపల్లి మండలంలో కూకట్లపల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోరు జరుగుతోంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుదారుగా నీరుడి అశోక్ బరిలో నిలవగా అతని తమ్ముడు నీరుడి కుమార్ భారాస మద్దతుతో పోటీలో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు వారికి మద్దతు తెలపడంతో అన్నాదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి.


