News April 7, 2025

జగిత్యాల: ప్రారంభమైన 10వ తరగతి స్పాట్ వాల్యూషన్

image

జగిత్యాల పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్ వాల్యూయేషన్ కోసం 70 మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ప్రతి రోజూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది.

Similar News

News September 19, 2025

రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్‌ పనుల పరిశీలన

image

మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సోమవారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్ గర్ల్స్ భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులను ఆయన ఆదేశించారు. డార్మెంటరీలు, తరగతి గదులు, కిచెన్, టాయిలెట్లు మొదట పూర్తి చేసి దసరా నాటికి భవనం వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.

News September 19, 2025

నిరంతరాయ శ్రమతోనే మంచి ఫలితాలు సాధ్యం: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కరీంనగర్ లో ఏర్పాటు చేసిన 300 మందికి శిక్షణ ఇస్తున్న శిబిరాన్ని సందర్శించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు అందుతున్న వసతులు, శిక్షణ నాణ్యతను పరిశీలించారు. నిరంతర ప్రయత్నం, ఫోకస్ ఉంటే విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ చెప్పారు.

News September 19, 2025

RBSK తో చిన్నారులలో ముందస్తు గుర్తింపు.. సమగ్ర సంరక్షణ

image

పిల్లల ఆరోగ్య భద్రతకు PDPL జిల్లాలో RBSK కార్యక్రమం సమర్థంగా అమలవుతోంది. 18ఏళ్ల లోపు పిల్లల్లో 4D’s లోపాలు, వ్యాధులు, అభివృద్ధి లోపాల ముందస్తు గుర్తింపు, చికిత్స కోసం 10మొబైల్ హెల్త్ బృందాలు పనిచేస్తున్నాయి. లక్ష్యం 2,39,594లో 2,35,800 మందిని స్క్రీనింగ్ చేసి, 35,655 మందిలో వ్యాధులు గుర్తించారు. వీరిలో 29,118 మందికి తక్షణ చికిత్స అందించగా, 6,537 మందిని రిఫర్ చేశారు. అందులో 5,527 మంది కోలుకున్నారు.