News April 7, 2025
జగిత్యాల: ప్రారంభమైన 10వ తరగతి స్పాట్ వాల్యూషన్

జగిత్యాల పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్ వాల్యూయేషన్ కోసం 70 మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ప్రతి రోజూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది.
Similar News
News April 25, 2025
ASF: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
News April 25, 2025
రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.
News April 25, 2025
పైసా ఫీజు లేకుండా భూ పరిష్కారం: కలెక్టర్

భూ భారతి చట్టం-2025 ద్వారా రైతుల భూ సమస్య తీర్చడానికి ప్రభుత్వం ద్వారా ఒక పైసా వసూలు చేయబోమని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. డోర్నకల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల్లో ప్రజలకు ఎదురైన అనేక ఇబ్బందులను సరిదిద్దుతూ, అన్ని విధాలుగా ఆలోచించి ఈ నూతన చట్టాన్ని రూపొందించారన్నారు.