News March 20, 2025

జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News October 16, 2025

నాలుగో రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని

image

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూల్ జిల్లాలో నేడు పర్యటించిన సంగతి తెలిసిందే. కర్నూల్ శివారులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభించారు. కొత్తవలస-విజయనగరం మధ్య రూ. 493 కోట్లతో చేపట్టే నాలుగో రైల్వే లైన్‌ను, అలాగే పెందుర్తి – సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ల మధ్య రూ.184 కోట్లతో నిర్మించే రైల్వే వంతెనను ప్రారంభించారు.

News October 16, 2025

క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

image

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

News October 16, 2025

గుజరాత్ మంత్రులంతా రాజీనామా

image

గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.