News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News November 10, 2025
క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్గా TAR-200

ఎలాంటి చికిత్సకు లొంగని మూత్రాశయ క్యాన్సర్ కణతులను(Tumors) TAR-200 అనే ఔషధ పరికరం 3 నెలల్లోనే కరిగించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఇది పాత పద్ధతిలా కాకుండా, ప్రతి 3 వారాలకు నిరంతరంగా కీమో మందును విడుదల చేస్తుంది. మూత్రాశయం తొలగించాల్సిన అవసరం లేకుండా 82% మంది రోగులకు ఈ చికిత్సతో క్యాన్సర్ నయమైంది. క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్గా నిలిచిన దీనికి FDA ఆమోదం తెలిపింది.
News November 10, 2025
భద్రాచలంలో భక్తుల రద్దీ

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆదివారం, సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడం, వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రామాలయంలోని క్యూలైన్లో కిక్కిరిశాయి. ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.
News November 10, 2025
చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.


