News March 20, 2025

జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News March 28, 2025

నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

News March 28, 2025

కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

image

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.

News March 27, 2025

డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి

image

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు

error: Content is protected !!