News January 27, 2025
జగిత్యాల: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 29న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. SSC, ఇంటర్ చదివినవారు అర్హులన్నారు. వేతనం రూ.16 వేల నుంచి రూ.25వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News November 3, 2025
పెద్దపల్లి: ‘కనీస విద్యా ప్రమాణాలు 90% మంది విద్యార్థులకు అందించాలి’

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 90% మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ముగిసేలోపు కనీస విద్యా ప్రమాణాలను చేరుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సోమవారం హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో చదవడం, రాయడం, లెక్కల నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలు నెలవారీ లక్ష్యాలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.
News November 3, 2025
HYD: మృతులకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి: సీపీఐ

చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతిచెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


