News March 19, 2025
జగిత్యాల: బడ్జెట్‌పైనే భారమంతా..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. జమ్మికుంట బస్సుడిపో ఏర్పాటు, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News September 13, 2025
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
News September 13, 2025
గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News September 13, 2025
విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.