News February 25, 2026
జగిత్యాల: బాధను దిగమింగి భవిష్యత్తు వైపు అడుగు

జగిత్యాల రూరల్ మండలంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో అప్పుల బాధతో కనగాల <<19225612>>అనూష<<>> కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిన వేళ, ఆమె పెద్ద కుమార్తె రమ్యశ్రీకి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే, ఆ తల్లి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో రమ్యశ్రీ కన్నీటిని దిగమింగి పరీక్షా కేంద్రానికి హాజరైంది.
Similar News
News April 12, 2026
‘డెకాయిట్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. షానియెల్ డియో డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ.15కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నిర్మల్‌కు 12వ స్థానం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో NRML జిల్లా 62.93% ఉత్తీర్ణతతో 12వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 5,778 మంది పరీక్ష రాయగా, 3,636 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,773 మందికి 1,391 మంది (36.87%) పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2,519 మంది (64.13%) ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 873 మంది పరీక్ష రాయగా 469 మంది విద్యార్థులు పాసై 53.72శాతంతో స్టేట్‌లో 29వ స్థానంలో నిలిచింది.


