News April 5, 2025
జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

JGTL జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో స్వాతంత్ర్య సమరయోధుడు, బాబు జగ్జీవన్ రామ్ జయంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ వ్యవసాయ, రక్షణ రంగాల్లో కీలక సేవలు అందించారని, కార్మిక హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఏడాదిలోగా జగిత్యాలలో విగ్రహం ఏర్పాటు చేస్తామని అడ్లూరి తెలిపారు.
Similar News
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
కొమురవెల్లి మల్లన్న కొత్త రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో నిర్మిస్తోన్న కొత్త రైల్వే స్టేషన్ పనులు 96% పూర్తయ్యాయి. త్వరలో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు రోజూ మల్లన్న దర్శనానికి రావడంతో ఈ స్టేషన్ నిర్మాణం వారి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. కొత్త రైల్వే సౌకర్యంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, ప్రాంతీయ రవాణా మరింత మెరుగవుతుంది.