News April 12, 2025
జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రాం విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం స్థలం పరిశీలించారు. మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని.. ప్రజల కోరిక మేరకు పట్టణంలో ప్రభుత్వా నిబంధనల మేరకు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్లో ఇండియన్ సిటిజన్షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News December 9, 2025
సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.
News December 9, 2025
బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


