News February 14, 2025
జగిత్యాల: బావిలో మృతదేహం.. అడ్రస్ లభ్యం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మృతిచెందిన వ్యక్తి అడ్రసును పోలీసులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన జక్కని సాయికుమార్ (30)గా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. సాయికుమార్ తన అత్తగారి ఊరైన పోసానిపేట గ్రామానికి ఐదు రోజుల క్రితం వచ్చి వెళ్లాడు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.
Similar News
News February 21, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి: SP

మార్చి 8న జరిగే లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించేలా చూడాలని పోలీసులకు ఎస్పీ రూపేశ్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.
News February 21, 2025
సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.
News February 21, 2025
ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం