News February 8, 2025
జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
సిద్దిపేట: CP పనితీరుపై ప్రశంసల జల్లు

సీపీ విజయ్ కుమార్ పనితీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్లో సీపీగా బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి సామాన్య రైతుతో అవగాహన కల్పించి అందరి మన్ననలు పొందారు. తాగి డ్రైవింగ్ చేసి పట్టుపడితే రూ.10 జరిమానా నిబంధనలకు సైతం మద్దతు లభించింది. సుభాష్ రోడ్, మార్కెట్ రద్దీకి చెక్ పెట్టారు.
News November 19, 2025
హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.
News November 19, 2025
బి.టి పత్తికి గులాబీ రంగు పురుగుతో ముప్పు

బి.టి పత్తిని నవంబర్, డిసెంబర్ నెలలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పూమొగ్గలు, లేతకాయలకు చిన్న రంద్రాలు చేసి లోపలకి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని, దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గి రంగు కూడా మారుతుంది. ఫలితంగా దిగుబడి, రాబడి తగ్గుతుంది.


