News February 8, 2025

జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

తూ.గో: వైసీపీలోకి ఉండవల్లి! సోషల్ మీడియాలో ప్రచారం

image

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నెట్టింట జోరందుకుంది. ఈ నెల 26న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని వైసీపీ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి. ఈ ప్రచారంపై ఉండవల్లి స్పందించాల్సి ఉంది. కాగా ఉండవల్లికి వైఎస్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

News February 8, 2025

ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేశారు: మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News February 8, 2025

వికారాబాద్: మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్  

image

గ్రామాల్లో మహిళలకు అవగాహన కలిగించి మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేసేందుకు సీఅర్‌పీ వ్యూహం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సీఅర్‌పీ మహిళలతో మాట్లాడారు. మహిళా సంఘాల బలోపేతం లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగయ్యనాయక్ ఉన్నారు. 

error: Content is protected !!