News February 8, 2025

జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 16, 2026

FLASH: ఏసీబీ వలలో కరీంనగర్ సూపరింటెండెంట్

image

ఫైళ్లలో తప్పులను సరిదిద్దేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయ సూపరింటెండెంట్ ఇగాల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బినామీ ఖాతా ద్వారా సుమారు ₹14.77 లక్షల మేర యూపీఐ లావాదేవీల రూపంలో లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది.

News March 16, 2026

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు తప్పనిసరి: VZM DMHO

image

జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తమ సేవల ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని DMHO ఎస్. జీవన్ రాణి సోమవారం ఆదేశించారు. స్కాన్ సెంటర్లు పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలు పాటిస్తూ లింగ నిర్ధారణ నేరమని తెలుపుతూ బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 16, 2026

TU: M.Ed మూడో సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పరీక్షకు 29 మంది విద్యార్థులకు 28 మంది విద్యార్థులు హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.