News February 3, 2025
జగిత్యాల బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరి బాబు

జగిత్యాల జిల్లా BJP అధ్యక్షుడిగా మెట్పల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రాచకొండ యాదగిరి బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఇంతకముందు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ వేసిన పలు కీలక కమిటీలకు ఛైర్మన్గా ఉన్నారు.
Similar News
News December 4, 2025
MBNR: గుర్తులొచ్చాయ్.. ప్రచారం షురూ

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న నిర్వహించనున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఎలక్షన్ అధికారులు ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో మునిగిపోయారు.
News December 4, 2025
సిరిసిల్ల: తొలి విడతలో 229 వార్డులు ఏకగ్రీవం

జిల్లాలో తొలివిడత ఎన్నికలకు సంబంధించి ఐదు మండలాల్లో 748 వార్డులకు గాను 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 519 వార్డుల్లో 1,377 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. రుద్రంగిలో 91, వేములవాడ అర్బన్ 218, వేములవాడ రూరల్ 262, కోనరావుపేట 459, చందుర్తి మండలంలో 347 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన దీనికి సంబంధించి పోలింగ్ నిర్వహిస్తారు.
News December 4, 2025
సమంత-రాజ్ పెళ్లి.. మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

రాజ్-సమంత పెళ్లి చేసుకున్న మూడు రోజులకు రాజ్ మాజీ భార్య శ్యామలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. ఇటీవల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి. గత నెల 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయింది. నాకు PR టీమ్ లేదు. స్వయంగా రెస్పాండ్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.


