News February 3, 2025
జగిత్యాల బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరి బాబు

జగిత్యాల జిల్లా BJP అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రాచకొండ యాదగిరి బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఇంతకముందు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ వేసిన పలు కీలక కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.
Similar News
News February 8, 2025
లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

TG: లా సెట్, ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్, మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష జరగనుంది.
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ విజయంపై ఎంపీ అర్వింద్ హర్షం

ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో శనివారం ఢిల్లీలో వారిని ఎంపీ కలిసి అభినందించారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.
News February 8, 2025
కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: కొండా సురేఖ

TG: BRS MLC కల్వకుంట్ల కవితతో కలిసి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేయడం వల్లే ఆప్ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. BRS పార్టీ ఎక్కడికెళ్లినా భస్మాసుర హస్తమేనని ఢిల్లీ ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై KTR వ్యాఖ్యలు అహంపూరితం. ఈ అహంకారాన్నిఅణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.