News April 16, 2025
జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కవితకు వినతి

జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా సహకరించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, కొక్కు గంగాధర్, రామచంద్రం, రోజా, బొమ్మిడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
నల్గొండ: ‘నో హెల్మెట్-నో పెట్రోల్’.. వ్యాపారులకు ఫుల్ డిమాండ్

జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తుండటంతో హెల్మెట్ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో ఇంధనం పోయాలని ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News January 9, 2026
TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
News January 9, 2026
KNR: ‘యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.


