News April 16, 2025

జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కవితకు వినతి

image

జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా సహకరించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, కొక్కు గంగాధర్, రామచంద్రం, రోజా, బొమ్మిడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News April 22, 2025

టేకులపల్లి: అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

image

టేకులపల్లి మండలం బావోజీ తండాకు చెందిన భూక్య లాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అతనికి రూ.4 లక్షల అప్పు కావడం, ఈ మధ్యలో అతను అనారోగ్యం పాలై వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.

News April 22, 2025

ఏలూరు: ఉపాధ్యాయ పోస్టులకు  అప్లై చేయండి: డీఈవో

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15వ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీఐ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను పరిశీలించాలన్నారు.

error: Content is protected !!