News February 27, 2026

జగిత్యాల: బెట్టింగ్ భూతం.. చెట్టుకు వేలాడిన దేహం

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. జగిత్యాల (R) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గర్వందుల మహేశ్ (38) ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహేశ్ కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ కారణంగా సుమారు రూ.25 లక్షలు నష్టపోయారు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.

Similar News

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 18, 2026

ఉపాధి హామీ పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి

image

పోడూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భ గుర్రపుడెక్కతో సహజ ఎరువు తయారు చేసే మిషన్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి హామీ పథకం బలమైన ఆధారమని, ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, అధికారులు పాల్గొన్నారు.