News April 2, 2025

జగిత్యాల: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

image

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.

Similar News

News April 18, 2025

చింతపల్లి: ఈనెల 22 వరకు జిల్లాలో మోస్తరు వర్షాలు

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. రాగల ఐదు రోజుల వాతావరణ సమాచారాన్ని శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. ఈనెల 22వ తేదీ వరకు రంపచోడవరం, చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 3.1 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు.

News April 18, 2025

వనపర్తి: బైక్ అదుపు తప్పి ఒకరికి గాయాలు

image

వనపర్తి మండలం అంజనగిరి శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పడంతో చందాపూర్‌కి చెందిన బాలయ్యకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన బాలయ్య పాన్‌గల్ మండలం కొత్తపేటలో డెయిరీ ఫామ్ నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం వనపర్తి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

News April 18, 2025

MEMU రైలు అనంతపురం వరకు..

image

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

error: Content is protected !!