News March 13, 2025
జగిత్యాల: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

జగిత్యాల జిలాల్లో భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగింది. పోలీసుల వివరాలు.. మద్యానికి బానిసైన రాజన్న(55) తాగి వచ్చి భార్య కళావతిని వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తాగొచ్చి గొడవ పడ్డాడు. కోపంతో కళావతి రాజన్నను గొడ్డలితో నరికి చంపింది. మృతుడి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
జనగామ: 3 వార్డులకు ఎన్నికలు లేవు!

తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పత్రాల పరిశీలన కొనసాగుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో 3 వార్డులకు రిజర్వేషన్ల కారణంగా నామినేషన్లు దాఖలు కాలేదు. జనగామ జిల్లాలో రెండో విడతలో కూడా 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కానట్లు తెలుస్తోంది. మొత్తంగా 10 వార్డుల వరకు నామినేషన్లు రాలేదని సమాచారం.
News December 2, 2025
ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

AP: బీఈడీ క్వాలిఫికేషన్తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 2, 2025
VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.


