News March 16, 2025
జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.
Similar News
News February 23, 2026
ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రభావం

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గట్లు మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.
News February 23, 2026
శనిదేవుడిని శాసించిన మహా తపస్వి

దధీచి మహర్షి కుమారుడే పిప్పలాద మహర్షి. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆయన మేనత్త వద్ద పెరిగాడు. తండ్రి మరణానికి ఇంద్రుడడని తెలిసి పగతో రగిలిపోయాడు. శివుడికై తపస్సు చేశాడు. శివుడు అతడిని శాంతింపజేసి అది విధి అని వివరించాడు. ఈయన ప్రశ్న ఉపనిషత్తు రాశారు. శనిదేవుడిని ఓడించి పిన్న వయసులో ఉన్నవారిని ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. చిన్నతనంలో ‘పిప్పల’(రావి) చెట్టు పండ్లను తిని జీవించడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది.
News February 23, 2026
వనపర్తి: టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు వనపర్తి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో 7,228 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.


