News March 28, 2025

జగిత్యాల: భౌతికశాస్త్రం రెగ్యులర్ 7 మంది విద్యార్థులు గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా ఐదోరోజు భౌతికశాస్త్రం రెగ్యూలర్‌కు 11855 విద్యార్థులకు 11848 విద్యార్థులు హాజరయ్యారు. 7 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.94% సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలల్లో 155 విద్యార్థులకు 141మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

Similar News

News November 5, 2025

రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్!

image

మరోసారి రజినీకాంత్-కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఈ మూవీ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రజినీ తన తర్వాతి రెండు మూవీస్ కమల్ ప్రొడక్షన్‌లోనే చేయబోతున్నారట. మొదటిది సుందర్ సి దర్శకత్వంలో, రెండోది నెల్సన్ డైరెక్షన్‌లో ఈ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

News November 5, 2025

శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

శ్రీశైలంలో ఇవాళ జరిగే జ్వాలాతోరణం, ఈనెల 14న జరిగే కోటి దీపోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించే చోట పోలీసుల ఆదేశాలు, సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలన్నారు.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.