News March 28, 2025
జగిత్యాల: మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రిపదవి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, దుమాల గంగారాం డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 26, 2025
రంగారెడ్డి జిల్లాలో త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో RR జిల్లాలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. నొటిఫికేషన్ రావడంతో త్వరలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
News November 26, 2025
పల్నాడు: భారంగా మారిన పశుగ్రాసం..!

పల్నాడులో ఎక్కువగా వరి కోతకు యంత్రాలు వాడటం వలన వరిగడ్డి చిన్న ముక్కలై పొలంలోనే ఉండిపోవడంతో పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం దొరకని పరిస్థితి నెలకొనడంతో, పశువులకు గడ్డి అందించడం భారంగా మారింది. దీంతో మిర్యాలగూడ వంటి దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డికి సుమారు రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.


