News September 21, 2024

జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.

Similar News

News October 11, 2024

కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ

image

రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.

News October 11, 2024

పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది: ఆది శ్రీనివాస్ 

image

పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల మానేరు వాగు తీరంలో గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు – 2024 పేరిట చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.

News October 10, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

image

సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు.