News February 4, 2025

జగిత్యాల మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి డీ.ప్రకాష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన కందులను ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రూ.7,550 కనీస మద్దతు ధర పొందాలన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం హబీబ్, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

image

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్‌ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.

News December 13, 2025

భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.