News February 2, 2025

జగిత్యాల మార్కెట్‌లో ధరలిలా.. 

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.5,350, గరిష్ఠ ధర రూ.6,289గా పలికింది. అటు అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.7,222, గరిష్ఠ ధర రూ.7,360. మక్కలు రూ.2,300, వరి ధాన్యం(1010) రూ.1,651, నువ్వులు రూ.9,511గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్‌: సాదాసీదాగా సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ నామినేషన్‌ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

News October 15, 2025

సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

image

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.

News October 15, 2025

HYD: దొరికారు కాబట్టి దొంగలు.. లేకపోతే!

image

రోజూ టికెట్ లేకుండా ప్రయాణించడం.. ఆ.. ఎవరు చెక్ చేస్తారులే అనే ధైర్యంతో వారంతా ఇన్ని రోజులూ రైల్లో ప్రయాణాలు చేశారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతోపాటు ఇతర డివిజన్లలో రైళ్లల్లో తనిఖీలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 16,105 కేసులు నమోదు చేశారు. అంతేకాక రూ.1.08 కోట్లను జరిమానాగా వసూలు చేశారు. SECలో రూ.27.9 లక్షలు, HYDలో రూ.4.6 లక్షలు వసూలు చేశారు.