News February 2, 2025
జగిత్యాల మార్కెట్‌లో ధరలిలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.5,350, గరిష్ఠ ధర రూ.6,289గా పలికింది. అటు అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.7,222, గరిష్ఠ ధర రూ.7,360. మక్కలు రూ.2,300, వరి ధాన్యం(1010) రూ.1,651, నువ్వులు రూ.9,511గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News February 9, 2025
పటాన్‌చెరు: గంజాయి నిందితులు మహారాష్ట్రలో అరెస్ట్

గంజాయి కేసు నిందితులను పోలీసులు మహారాష్ట్ర వెళ్లి పట్టుకున్నారు. పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీసులు మహారాష్ట్ర వెళ్లి 220 కిలోల గంజాయి నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. 2024 సంవత్సరంలో 220 కిలోల గంజాయి నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు అమర్ సంజయ్ కావాల్, దిలీప్ ఆగడాలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పటాన్‌చెరు పీఎస్ SHO పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.
News February 9, 2025
PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి జిమ్‌లో ఉన్న ఫొటోను మరో హీరో వరుణ్ తేజ్ పంచుకున్నారు. జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC16లో బిజీగా ఉండగా ‘సంబరాల ఏటి గట్టు’తో సాయి ధరమ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 9, 2025
గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.