News February 18, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు గరిష్ఠంగా రూ.7250 వరకు పలికాయి. కనిష్ఠ ధర రూ.4259గా ఉంది. అనుములు రూ.5000 నుంచి రూ. 7000 మధ్య పలికాయి. మక్కలు రూ.2121 నుంచి రూ.2266 మధ్య పలికాయి. వరి ధాన్యం (HMT) రూ.2175, వరి ధాన్యం(JSR) రూ.2645గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News March 18, 2025

ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా

image

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 21 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియా ట్వీట్ చేసింది. కాలేజీ జీవితం, నిజాయితీపై అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News March 18, 2025

వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

image

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

error: Content is protected !!