News April 15, 2025
జగిత్యాల మార్కెట్ సమాచారం

జగిత్యాల బీటులో నేటి ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 2266, కనిష్ఠ ధర రూ. 1855, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 13001, కనిష్ఠ ధర రూ. 8500, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11700, కనిష్ఠ ధర రూ. 6500, కందులు గరిష్ఠ ధర రూ. 6386, కనిష్ఠ ధర రూ. 5454, ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ. 1860, కనిష్ఠ ధర రూ. 1750, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ. 1840, కనిష్ఠ ధర రూ. 1800లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.
Similar News
News December 7, 2025
కడియంలో “జనసేన”కేదీ ప్రాధాన్యత..?

కడియం మండలంలో జనసేనకి ప్రాధాన్యం తగ్గుతుందని ఆ పార్టీ శ్రేణులు అంతర్మధనంలో ఉన్నాయి. గతంలో మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానం గెలిచినా ఎంపీపీ పదవిని టీడీపీకి త్యాగం చేశారు. తాజాగా సొసైటీ ఛైర్మన్ల నియామకంలోనూ టీడీపీ మూడు దక్కించుకోగా, జనసేనకు ఒక్కటే దక్కింది. ఇప్పటికే రెండు పదవులున్న ఎంపీపీ బంధువుకే మళ్లీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లోకల్‌గా టాక్ నడుస్తోంది.
News December 7, 2025
కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.
News December 7, 2025
ఆసిఫాబాద్: ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘణ.. పలువురిపై కేసు’

ఆసిఫాబాద్(M) మోతుగూడ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వినోద్‌కు మద్దతుగా ఎలాంటి అనుమతి లేకుండా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఎఫ్ఎస్టీ అధికారి ఫిర్యాదు మేరకు వినోద్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


