News October 20, 2024

జగిత్యాల మీదుగా ముంబైకి రైలు

image

KNR నుంచి జగిత్యాల(లింగంపేట)లోని రైల్వే స్టేషన్ మీదుగా ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలు తిరిగి పునః ప్రారంభించారు. పరిసర ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకొనుంది. కాగా ఇదే రైలు తిరిగి గురువారం ముంబై (దాదర్) నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జగిత్యాలకు రానుంది.

Similar News

News November 8, 2024

కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు

image

కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,17,156 యూనిట్ల పరిధిలో మొత్తం 2,76,620 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 566 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 49 లక్షల కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News November 8, 2024

FLASH.. KNR: గోదావరిలో యువకుడు గల్లంతు

image

గోదావరి నదిలో నీట మునిగి యువకుడు గల్లంతైన ఘటన శుక్రవారం మల్లాపూర్ మండలం వివిరావుపేట గోదావరి నదిలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన శ్రీవర్ధన్(18) మేనకోడలు పుట్టు వెంట్రుకల శుభకార్యానికి గోదావరికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సత్యనారాయణ

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుతో వేసిన రేవంత్ రెడ్డి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.