News February 12, 2026
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాన్ని జగిత్యాల పట్టణంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిసి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, కౌంటింగ్ టేబుళ్లను పరిశీలించారు.
Similar News
News March 14, 2026
భద్రాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో HPCL14, BPCL5, IOCL7 గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,41,175, డబుల్ సిలిండర్ 98,868, దీపం 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2,465, ప్రధాన పీఎంయూవై కనెక్షన్లు 73,162 ఉన్నాయన్నారు. గ్యాస్ కొరత లేదని తెలిపారు
News March 14, 2026
ADB: వంటింట్లో యుద్ధ సెగలు

చమురు, గ్యాస్ ధరల సెగ వంటింటిపై పడుతోంది. వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. అధికారికంగా రూ.60 పెరిగి సిలిండర్ ధర రూ.920 కాగా, బ్లాక్ మార్కెట్లో రూ.1100 వరకు ఉంది. ADBలో 282.2, ASFలో 190.0, MNCLలో 345.2, నిర్మల్‌లో 269.3 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు సిలిండర్‌పై రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


