News March 7, 2025

జగిత్యాల: మూడవరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో మొత్తం 7313 మంది విద్యార్థులకు గాను 7108 విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. 205 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 6271 మందికి 6144 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 1042 మందికి 964 విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Similar News

News November 8, 2025

జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్‌సైట్: https://cujammu.ac.in/

News November 8, 2025

NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

image

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 8, 2025

DANGER: ఇయర్‌ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

image

శరీరంలో ఇయర్‌ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్‌ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్‌ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్‌ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.