News February 3, 2025

జగిత్యాల: మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..

image

నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని, నాలుగు స్పెల్స్‌లో జరుగుతాయని జగిత్యాల ఇంటర్‌ నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్‌లో 7,054 మంది, సెకండియర్‌లో 6,141 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్‌‌కు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News November 23, 2025

సంగారెడ్డి: ‘మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం’

image

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ. 590 కోట్ల రుణాలను అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 32 కోట్ల వడ్డీ రాయితీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని పేర్కొన్నారు.

News November 23, 2025

ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

image

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్‌కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్‌లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.

News November 23, 2025

సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.