News February 3, 2025
జగిత్యాల: మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..

నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని, నాలుగు స్పెల్స్‌లో జరుగుతాయని జగిత్యాల ఇంటర్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్‌లో 7,054 మంది, సెకండియర్‌లో 6,141 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్‌కు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 14, 2025
విశ్వక్‌సేన్ ‘లైలా’ రివ్యూ

బ్యూటీపార్లర్ నడుపుకునే హీరో ఓ కేసులో చిక్కుకోవడం, బయటపడేందుకు ఏం చేశాడనేదే ‘లైలా’ స్టోరీ. విశ్వక్‌సేన్ లేడీ గెటప్, అక్కడక్కడా కామెడీ సీన్లు కొంత వరకు ఫర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ సక్సెస్ కాలేకపోయారు. సెంటిమెంట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా మెప్పించలేకపోయాయి.
RATING: 1.75/5
News February 14, 2025
నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
News February 14, 2025
సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.