News February 16, 2025

జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

image

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15470497>>కంబాల హారిక<<>> తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

HYD: త్వరలో ఈ ప్రాంతల్లో సైతం జలమండలి..!

image

ORR బయట, లోపల ఉన్న ఏరియాలను సైతం జలమండలిలోకి కలపటం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ORR చుట్టూ లోపల, బయట విస్తరించనుంది. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఇక జలమండలి పరిధిలోకి రానున్నాయి.

News December 1, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

image

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.

News December 1, 2025

ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.