News February 16, 2025
జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15470497>>కంబాల హారిక<<>> తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పోలీసు బందోబస్తు సిద్ధం: ఎస్పీ

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం కోనసీమ జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
News March 15, 2026
కామారెడ్డి: 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు

రామారెడ్డి మండలం అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DLPO శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో సన్మానాలు నిర్వహించామన్నారు.
News March 15, 2026
నిజామాబాద్: బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు వారికి దిశా నిర్దేశం చేశారు.


