News February 4, 2025
జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 30, 2025
ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
News October 30, 2025
నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్: పీవో

సీతంపేటలోని NTR అడ్వెంచర్ పార్కులో నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథం గురువారం తెలిపారు. ఈ ఈవెంట్లో హార్ట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అదే రోజు జన జాతీయ గౌరవ దివస్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.


