News February 4, 2025
జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Similar News
News November 24, 2025
వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
News November 24, 2025
బాపట్ల: మాంసం దుకాణాల్లో మోసాలు..!

బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడులోని మాంసం దుకాణాలను తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో కాటాలకు సరైన ముద్రలు లేనట్లు గుర్తించారు. వారికి రూ.9 వేలు ఫైన్ వేశారు. కొలతల్లో లోపాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు కచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందజేయాలని ఆదేశించారు. మీ దగ్గర తూకాల్లో మోసం జరుగుతుందా? కామెంట్ చేయండి.


