News February 17, 2025
జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.
News November 20, 2025
భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

భిక్కనూర్లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.


