News February 17, 2025
జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News October 30, 2025
శంకరపట్నం: తల్లికొడుకులపై గొడ్డలితో దాడి.. హత్యాయత్నం

శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో తల్లికొడుకులపై గొడ్డలితో దాడి జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రాజు, గడ్డం మల్లవ్వపై చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన వారి బంధువులు హత్యా ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 30, 2025
KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
News October 29, 2025
KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.


