News March 27, 2025

జగిత్యాల: రాష్ట్రంలోనే టాప్ రాఘవపేట

image

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో రాఘవపేట రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు.

Similar News

News October 26, 2025

వనపర్తిలో పోలీసుల సైకిల్ ర్యాలీ

image

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉంటుందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ ప్రారంభించి పోలీస్ అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగుతుందన్నారు.

News October 26, 2025

చల్వాయి, గోవిందరావుపేట షాపులకు డ్రా నిలిపివేత..!

image

ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట మద్యం దుకాణాలకు డ్రాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భూపాలపల్లి ఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని షాపులకు డ్రా జరుగుతోందని, కానీ ప్రోహిబిషన్& ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ఈ రెండు దుకాణాలకు డ్రా నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు.

News October 26, 2025

తుఫాన్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

image

మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.