News March 12, 2025
జగిత్యాల: రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలి: అదనపు కలెక్టర్

రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ (DCC) త్రైమాసిక సమీక్షా సమావేశoలో ఆమె మాట్లాడారు. జిల్లా బ్యాంకింగ్ రంగ ప్రగతిని సమీక్షించడంతోపాటు ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందుబాటు, వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ తదితర అధికారులున్నారు.
Similar News
News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News March 13, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత కొద్దిరోజులుగా పత్తి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. మంగళవారం రూ.6,950కి పడిపోయింది. మళ్లీ బుధవారం రూ.6,960 కాగా.. ఈరోజు మళ్లీ రూ.6,950కి చేరింది. ధర ఏడు వేల దిగువకు పడిపోవడంతో పత్తి పండించిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
News March 13, 2025
NLG: యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త పథకానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం 30వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అంటున్నారు.