News March 2, 2025
జగిత్యాల: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రేపు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News December 3, 2025
1,232 విమానాలు రద్దు: DGCA

IndiGo ఇటీవల 1,232 విమానాలను రద్దు చేసిందని DGCA ప్రకటించింది. ఇందులో సిబ్బంది, FDTL పరిమితుల వల్లే 755 ఫ్లైట్స్ రద్దయినట్లు పేర్కొంది. ATC సమస్యలతో 16% ఫ్లైట్స్, క్రూ రిలేటెడ్ డిలేస్తో 6%, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లిమిటేషన్స్ వల్ల 3% సర్వీసులు క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. OCTలో 84.1%గా ఉన్న IndiGo ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ NOVలో 67.7%కి డ్రాప్ అయిందని వివరించింది. HYDలోనూ పలు విమానాలు రద్దయ్యాయి.
News December 3, 2025
బాపట్ల: డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి బలి..!

సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పట్టాభిరామయ్య వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం అచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన జాస్తి నాగేశ్వరరావు(54) టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News December 3, 2025
కామారెడ్డి: వరి కొనుగోలు డేటా ఎంట్రీపై కలెక్టర్ సమీక్ష

వరి కొనుగోలు ప్రక్రియ యాప్లో ఎంట్రీలపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య ద్వారా, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కొన్నిచోట్ల డేటా ఎంట్రీ పూర్తి చేయలేదన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, DRDO సురేందర్ పాల్గొన్నారు.


